అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 21 Market Analysis | అమెరికా, ఇరాన్ Iran ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wallstreet) స్వల్ప నష్టాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్ గా ముగిశాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి.
July 21 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 0.05 శాతం, ఎస్ అండ్ పీ 0.19 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.09 శాతం లాభంతో ఉంది.
July 21 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.06 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.02 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.72 శాతం నష్టపోయింది.
July 21 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.60 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.36 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.69 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.28 శాతం లాభాలతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.63 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.04 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.54 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Bonalu Festival | తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బోనం’ : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,121 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,312 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.42 నుంచి 1.28 కు పడిపోయింది.
- విక్స్ 1.29 శాతం తగ్గి 12.98 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 88.64 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలహీనపడి 96.45 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 100.96 కు, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.60 కు పెరిగాయి.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.