Mivi One 5G | మివీ నుంచి తొలి స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో..

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి దేశీయ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివీ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి 5జీ ఫోన్ మివీ వన్ 5జీ అమ్మకాలను ప్రారంభించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mivi One 5G | భారతీయ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివీ.. స్మార్ట్ ఫోన్ రంగంలోకీ అడుగుపెట్టింది. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లతో మివీ వన్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 16తో పనిచేసే శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ కెమెరా తదితర ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో మాత్రమే అందుబాటులో ఉంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 90హెచ్ జెడ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది.
ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రిసిస్టెన్స్ సర్టిఫికెట్ ఉంది.

ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16పై పని చేస్తుంది. రెండేళ్లపాటు ఓఎస్ అప్డేట్లు ఇస్తామని కంపెనీ చెబుతోంది.

Mivi One 5G | కెమెరా సెటప్..

ఫోన్ వెనక వైపు శాంసంగ్ ఐసోసెల్ 50 ఎంపీ డ్యుయర్ కెమరా ఇచ్చారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Mivi One 5G | బ్యాటరీ సామర్థ్యం..

6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

మÖడు వేరియంట్లలో..

ఈ ఫోన్ బ్లూ, పింక్, గ్రీన్, బర్గండీ, నేవీ బ్లూ కలర్లలో మÖడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
4జీబీ రామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999.
6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999.
8జీబీ రామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499.

ఆఫర్స్ : ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్ కార్ట్ కూపన్ ద్వారా రూ. 2,200 వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై అదనంగా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

సర్వీస్ ఉచితం : మివీ కంపెనీకి దేశవ్యాప్తంగా 500 సర్వీస్ సెంటర్లున్నాయి. మివీ వన్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు ద్వారా మివి కేర్ ప్లస్ సర్వీస్ ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌కు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంటి నుంచే ఈ సర్వీస్‌ను ఉచితంగా పొందవచ్చు. అంటే కంపెనీ ప్రతినిధులే ఇంటికి వచ్చి పికప్ చేసుకొని, రిపేర్ చేసి, తిరిగి కస్టమర్‌కు ఇంటి వద్దే అందిస్తారు. 7 రోజులలోగా ఫోన్ రిపేర్ కాకపోతే కొత్త ఫోన్ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | క్రూడ్ ఆయిల్ ధర పైపైకి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *