అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Singareni Workers | సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆమె ముట్టడించారు.
కవిత మాట్లాడుతూ.. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేసి, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టాలన్నారు. అలాగే మారుపేర్లు (అలియాస్ నేమ్స్) సమస్యను పరిష్కరించాలని సూచించారు.
Singareni Workers | ఖాళీలు భర్తీ చేయాలి
సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. విజిలెన్స్ పేరుతో ఆపిన డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలని, కార్మికులకు ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు జీతాలు చెల్లించాలని, సింగరేణికి బకాయిపడిన రూ.62 వేల కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి: Ujjal Bhuyan Voting Rights | ఓటును వేరు చేయడం అంటే ఆత్మను వేరు చేసినట్లే.. జస్టిస్ ఉజ్జల్ సంచలన వ్యాఖ్యలు