అక్షరటుడే, ఇందూరు: Nizamabad General Hospital | జిల్లా జనరల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తొందరగా పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) కోరారు. సోమవారం హైదరాబాద్‌లో(Hyderabad) రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. .
Nizamabad General Hospital | రెండువేలకు పైగా ఓపీ..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా జనరల్ ఆస్పత్రిలో (Telangana Health) నిత్యం 2 వేలకు పైగా ఓపీ నమోదవుతుందన్నారు. అటువంటి ఆస్పత్రిలో మల్టీ స్పెషాలిటీ స్థాయి సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా ఆస్పత్రిలో ఎంఆర్ఐ, మార్చురీ ఫ్రీజర్ల అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆక్సిజన్ ప్లాంట్ సరిగా పనిచేయడం లేదని దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ఆస్పత్రిలో సివిల్ వర్క్‌లకు సంబంధించిన పనులను తొందరగా పూర్తి చేయాలని, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చర్చించినట్లు చెప్పారు. అలాగే సివిల్ సర్జన్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్లు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు.
ఇది కూడా చదవండి: మూడేళ్లలోపే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన NIMS..