అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: El Nino Nizamabad | ఎల్‌నినోపై ప్రతిపక్షాల చెప్తున్న మాటలను నమ్మవద్దని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
El Nino Nizamabad | గత రెండేళ్లలో పుష్కలంగా వర్షాలు..
నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రెండేళ్లు పుష్కలంగా వర్షాలు కురిశాయన్నారు. దీంతోపాటే నాణ్యమైన కరెంట్ సైతం ఇచ్చామన్నారు. దురదృష్టవశాత్తు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాల్లేవన్నారు. ప్రపంచంలోని 110 దేశాలతో పాటు, మన దేశం, మన రాష్ట్రం కూడా ఎల్‌నినో ప్రభావానికి గురైందని వివరించారు. దీనిని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని అనడం వారి అవివేకాన్ని తెలియజేస్తుందన్నారు.
El Nino Nizamabad | విద్యుత్ వినియోగం పెరిగింది
ఈ ఏడాది పడిన వర్షాలతో నిజాంసాగర్‌లో 10టీఎంసీ నీటి నిల్వతో అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project)తో 40టీఎంసీలతో రైతులకు కొంత ఊరట కలిగిందన్నారు. రాష్ట్రంలో గతంలో విద్యుత్ వినియోగం 13వేల మెగావాట్లు ఉంటే.. ఈ ఏడాది సుమారు 20వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఆనాడు కరోనా యావత్ప్రపంచాన్ని చుట్టుముట్టిందని.. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పూర్తి మద్దతిచ్చామని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ కరోనాకు పారసిటమొల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అనేకమంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. ఎల్‌నినో వల్ల వర్షాలు పడకపోతే హరీష్‌రావ్, కేటిఆర్ రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, మేయర్ ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కౌడప్ శరత్, గాదారి గోపి, రత్నాకర్ గౌడ్, జిల్లా పార్టీ కోశాధికారి భక్త వత్సలం, బాల నర్సయ్య, రాజా నరేందర్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Seethakka Banswada Visit | బాన్సువాడలో మంత్రి సీతక్క పర్యటనపై పోచారం సమీక్ష