Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bal Bhavan | చిన్నారుల ప్రతిభా ప్రదర్శనకు బాల్​భవన్​ చక్కని వేదిక అని డీఈవో అశోక్ (Deo Ashok)​ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల్​భవన్​లో మంగళవారం వేసవి శిక్షణ తరగతుల్లో (summer training) భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Bal Bhavan | ప్రతిభను వెలికితీసే వేదిక..

డీఈవో మాట్లాడుతూ.. చిన్నారుల్లో అపారమైన ప్రతిభ ఉంటుందని.. దానిని వెలికితీసేందుకు సరైన వేదికలు అవసరమన్నారు. వేసవి సెలవులను వృథా చేయకుండా వివిధ రకాల ప్రదర్శనలకు బాల్​భవన్ చక్కటి వేదికగా మారిందన్నారు. చిన్నారులు ఆయా ప్రదర్శనల్లో చూపిస్తున్న ప్రతిభ చూస్తే ముచ్చటేస్తుందన్నారు. అలాగే బాల్​భవన్​ ఫౌండర్​ నారాయణ సింహాచలం వారసులు మామిడిపూడి ప్రేమలత హాజరై మాట్లాడుతూ.. చిన్నారులు ప్రతిభ అద్భుతమన్నారు.

బాల్​భవన్​ సూపరింటెండెంట్​ మల్లాది ఉమాబాల మాట్లాడుతూ..జిల్లావ్యాప్తంగా(Nizamabad) 750 మంది చిన్నారులకు వేసవి సెలవుల్లో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన పదిమంది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి, సర్టిఫికెట్లను డీఈవో అందజేశారు. చిన్నారులు వేసిన జడకొప్పులాట, యోగా ప్రదర్శన, బాంగ్రా నృత్యం, శ్లోకాలు, కర్రసాము అహుతులను అలరించాయి. ఈ ​కార్యక్రమంలో పూర్వ బాల్​భవన్​ సూపరింటెండెంట్​ విఠల్​, ప్రభాకర్​, పుష్పలత, వెంకటలక్ష్మి, నటరాజ్​, శ్వేత, సోనాలి, రిచా, మాధవి, నవీన్​, రాంచందర్​, గణేష్​, మాధవి, విజయ తదితరులు పాల్గొన్నారు.

dance

ఇది కూడా చదవండి: Aaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని ‘ఆయా షేర్’ సాంగ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *