అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 14 Market Analysis | ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్(PPI) తక్కువగా నమోదవడంతో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.
దీనికితోడు ప్రముఖ టెక్నాలజీ కంపెనీల షేర్లు రాణించడంతో గత సెషన్‌లో ఎస్ అండ్ పీ ఇండెక్స్ మరోసారి రికార్డు స్థాయి ముగింపును నమోదు చేసింది. అయితే యూరోప్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
Tree Cutting Fine | అనుమతులు లేకుండా చెట్ల నరికివేత.. కాంట్రాక్టర్‌కు రూ.8 వేల జరిమానా
Aug 14 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.81 శాతం, ఎస్ అండ్ పీ 0.65 శాతం పెరగ్గా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం లాభంతో ఉంది.
Aug 14 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.56 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.12 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.28 శాతం నష్టపోయాయి.
Aug 14 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.54 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.86 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.51 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.16 శాతం లాభంతో, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.97 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.10 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.12 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 510 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 4,353 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 95.44 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.90 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.65 వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 86.62 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.92 వద్ద ఫ్లాట్‌గా ఉంది.
- విక్స్ 2.33 శాతం తగ్గి 11.41 వద్ద ఉంది.