Crude Oil Prices | తగ్గని క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో కుదేలవుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 645 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crude Oil Prices | అమెరికా -ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. సమీప భవిష్యత్తులో దీనికి పరిష్కారం కనిపించడం లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధంతో చమురు ధరలు గణనీయంగా పెరిగాయి.

ప్రస్తుతం బ్యారెల్‌కు వంద డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. బలహీనమైన ప్రపంచ సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సైతం వరుసగా మÖడో సెషన్‌లోనూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Crude Oil Prices | ఐపీవోల ప్రభావం

దేశీయ స్టాక్ మార్కెట్‌ను ఐపీవో (IPO)లు ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 150 వరకు పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. మరికొన్ని క్యూలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్ నుంచి పెట్టుబడిని ఉపసంహరించుకుంటూ పబ్లిక్ ఇష్యూలకు మళ్లిస్తుండడంతో ప్రధాన సూచీలు నష్టపోతున్నాయి.

Crude Oil Prices | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 162 361పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 04 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 297 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 27 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 183 పాయిట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 645 పాయింట్ల నష్టంతో 74,932 వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో 23,474 వద్ద ఉన్నాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 5 స్టాక్స్ లాభాలతో, 25 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. అదానీపోర్ట్స్ 2.52 శాతం, టాటా స్టీల్ 1.93 శాతం, ఎన్టీపీసీ 0.68 శాతం, ట్రెంట్ 0.57 శాతం, ఎల్టీ 0.26 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఇన్ఫోసిస్ 4.22 శాతం, హెచ్సీఎల్ టెక్ 4 శాతం, టెక్ మహీంద్రా 3.12 శాతం, టీసీఎస్ 2.60 శాతం, హెచ్యూఎల్ 1.77 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Karamtara Engineering IPO | ఐపీవోకు ఇంజినీరింగ్ కంపెనీ.. ఊరిస్తున్న జీఎంపీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *