Rahul Gandhi | పంజాబ్​ ప్రభుత్వంపై రాహుల్​గాంధీ విమర్శలు

పంజాబ్​లోని ఆప్​ ప్రభుత్వంపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi | పంజాబ్ (Punjab)​లోని ఆప్​ ప్రభుత్వంపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శలు చేశారు. డ్రగ్స్ బెడదను ఎదుర్కోవడానికి రాష్ట్రం తగినంతగా కృషి చేయడం లేదని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపులతో అతడు ప్రాణాలు తీసుకున్నాడని రాహుల్​ ఆరోపించారు.

పంజాబ్ ప్రభుత్వంలో ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోందని రాహుల్​ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే, బెదిరింపులు, హింసల రూపంలో ప్రతిస్పందన వస్తుందన్నారు. డ్రగ్స్ సమస్యపై పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమాను ప్రశ్నించినందుకు క్షమాపణ చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో సంగ్రూర్ జిల్లాకు చెందిన గుల్జార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Rahul Gandhi | ప్రభుత్వం విఫలమైంది

తన కొడుకు డ్రగ్స్‌కు బలికావడంతో గుల్జార్ సింగ్ డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని ప్రశ్నించారన్నారు. ఆయనను తీవ్రంగా హింసించి, అవమానించి, క్షమాపణ చెప్పమని ఒత్తిడి చేశారని ఆరోపించారు. దీంతో ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరైన ఒక కార్యక్రమంలో నల్ల జెండా పట్టుకుని డ్రగ్స్​సమస్యను లేవనెత్తినందుకు, మరో వ్యక్తిని పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని గాంధీ అన్నారు. ప్రజలకు జవాబు చెప్పడమే ప్రభుత్వ పని అన్నారు. ప్రశ్నలు అడిగేవారిని అణచివేయడం కాదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Vande Mataram Row | పూర్తి వందేమాతరం గీతం ఆలపించడంపై కాంగ్రెస్​ అభ్యంతరం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *