జాతీయంMilk Packet Colors | పాల ప్యాకెట్.. ఏ రంగులో ఏముందో?

Milk Packet Colors | పాల ప్యాకెట్.. ఏ రంగులో ఏముందో?

పాల ప్యాకెట్లు పూర్తిగా తెల్ల రంగులోనే కాకుండా వివిధ రంగుల్లో కనిపిస్తాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Milk Packet Colors | పాల ప్యాకెట్లు నీలం, ఆకుపచ్చ, నారింజ వంటి వేర్వేరు రంగుల్లో ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే ఆ రంగు కేవలం వినియోగదారులను ఆకర్షించడానికి ఎంచుకున్నది కాదు.. ఒక్కో రంగు ఆ పాలలోని కొవ్వు శాతాన్ని చెబుతుంది. మరి ఏ రంగు ప్యాకెట్‌లో ఎంత కొవ్వు శాతం ఉంటుందో తెలుసుకుందామా..

Milk Packet Colors | ఏ కంపెనీ చూసినా..

అమూల్, మదర్ డెయిరీ, విజయ, ఆరోగ్య, దొడ్ల, ప్రియ, కరీంనగర్, హెరిటేజ్, జెర్సీ.. ఇలా ఏ కంపెనీ పాల ప్యాకెట్ అయినా పూర్తిగా తెల్ల రంగులోనే ఉండదు.. భారతదేశంలో పాల ప్యాకెట్లు ఎక్కువగా తెలుపుతోపాటు నీలం, ఆకుపచ్చ, నారింజ రంగులలో లభిస్తాయి. కొన్ని ఇతర రంగులతో కూడి ఉంటాయి. ఆ పాలు లేతగా ఉన్నాయా, చిక్కగా ఉన్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా అనే విషయాన్ని ఆయా రంగులు తెలియజేస్తాయి. అందుకే చాలామంది వినియోగదారులు ప్యాకెట్ లోపల ఎంత శాతం కొవ్వు ఉందో తెలుసుకోవడానికి ఈ రంగులనే కొండ గుర్తులుగా వాడతారు. మన దేశంలో ఆహార పదార్థాల నాణ్యతను, వాటి ప్యాకెట్ల మీద ఉండాల్సిన వివరాలను ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ (FSSAI) అనే సంస్థ పర్యవేక్షిస్తుంది. అయితే పాల ప్యాకెట్లకు ఏ రంగు వేయాలనేది ఆయా డెయిరీ కంపెనీలే నిర్ణయించుకుంటాయి. అనేక డెయిరీలు అనుసరించే ప్రామాణిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దాదాపు ఒకేలా ఉంటాయి.

Milk Packet Colors | కొవ్వు శాతం ఆధారంగా..

టోన్డ్ మిల్క్ : నీలం రంగు పాల ప్యాకెట్‌లో ఉండే పాలను టోన్డ్ మిల్క్ అంటారు. ఇందులో 3 శాతం కొవ్వు ఉంటుంది. ఈ పాలు టీ, కాఫీలకు సరిపోతాయి.

స్టాండర్డైజ్డ్ మిల్క్ : ఆకుపచ్చ రంగు ప్యాకెట్​లో ఉండేవాటిని స్టాండర్డైజ్డ్ మిల్క్ గా పిలుస్తారు. ఇందులో 4.5 శాతం కొవ్వు ఉంటుంది. ఇవి కొంచెం చిక్కగా ఉంటాయి.

ఫుల్ క్రీమ్ మిల్క్ :నారింజ రంగు ప్యాకెట్లలో ఉండే పాలను ఫుల్ క్రీమ్ మిల్క్‌గా పిలుస్తారు. ఇందులో 6 శాతం కొవ్వు ఉంటుంది. ఈ పాలు చాలా చిక్కగా ఉంటాయి. పెరుగు తయారీకి, స్వీట్స్ చేయడానికి బాగుంటాయి.

డబుల్ టోన్డ్ మిల్క్ : పింక్ లేదా మెజెంటా రంగులో ఉండే ప్యాకెట్లలో ఉండే పాలను డబుల్ టోన్డ్ మిల్క్ గా పేర్కొంటారు. ఇందులో 1.5 శాతమే కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి లేదా డైట్‌లో ఉన్నవారికి ఈ పాలు మంచివి.

ఇది కూడా చదవండి..: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...