Tombo Imaging IPO | 71 శాతం జీఎంపీ.. ఊరిస్తున్న డిఫెన్స్ కంపెనీ ఐపీవో

డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన టోంబో ఇమేజింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మెయిన్ బోర్డు ఐపీవో ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tombo Imaging IPO | టోంబో ఇమేజింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీని 2003లో ఏర్పాటు చేశారు. ఇది అభివృద్ధి చెందుతున్న ఒక ప్రపంచ రక్షణ ఎలక్ట్రానిక్స్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ కంపెనీ. ఈ సంస్థ రక్షణ మరియు భద్రతా అవసరాల కోసం అధునాతన ఎలక్ట్రో ఆప్టిక్, ఇన్‌ఫ్రారెడ్, ఎంబెడెడ్ విజన్, కమ్యూనికేషన్, గైడెన్స్, సర్వైలెన్స్ సిస్టమ్‌ల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగాలలో నిమగ్నమై ఉంది.

Tombo Imaging IPO | 24 దేశాలలో సేవలు..

కంపెనీ థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్స్, వెపన్ సైట్స్, మిస్సైల్ సీకర్స్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్స్, టార్గెటింగ్ సిస్టమ్స్, హ్యాండ్‌హెల్డ్ థర్మల్ ఇమేజింగ్ వంటి పరికరాలను తయారు చేస్తుంది. 24 దేశాలలోని రక్షణ మరియు భద్రతా సంస్థలకు 28 వేలకు పైగా క్షేత్రస్థాయిలో మోహరించిన సిస్టమ్‌ల ద్వారా సేవలు అందిస్తోంది. ప్రభుత్వ మరియు రక్షణ సంస్థల కోసం థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్‌లను తయారు చేసే భారతదేశంలోని అతిపెద్ద సంస్థగా నిలుస్తోంది.

Tombo Imaging IPO | రూ. 852.18 కోట్ల ఐపీవో..

కంపెనీ ఐపీవో (IPO) ద్వారా మొత్తం రూ. 852.18 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,21,74,046 షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. దీంతో పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా కంపెనీకి చెందదు. ఇన్వెస్టర్ల ఖాతాలోకి నిధులు వెళ్లనున్నాయి.

Tombo Imaging IPO | ప్రైస్ బ్యాండ్..

కంపెనీ ధరల శ్రేణిని రూ. 665 నుంచి రూ. 700 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 21 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,700 తో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

కోటా : ఐపీవోలో క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు.

జీఎంపీ : టోంబో ఇమేజింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 500 ప్రీమియంతో ఉంది. అంటే లిస్టింగ్ సమయంలోనే ఐపీవో ఇన్వెస్టర్లకు 71 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : టోంబో ఇమేజింగ్ ఇండియా లిమిటెడ్ ఐపీవో అక్టోబర్ 15న ఓపెన్ అయ్యింది. అక్టోబర్ 19 వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 21న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు అక్టోబర్ 23న బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: Jio IPO | జియో ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్.. 21నుంచి అందుబాటులోకి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *