అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అపరిష్కృతంగా ఉన్న హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా నౌకల రవాణా అంశం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరాకపోవడంతో ద్రవ్యోల్బణ భయాలతో వరుసగా మూడో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ క్షీణించాయి.
Stock Market Losses | ఒడిదుడుకుల పయనం..
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఎనిమిది పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేక 456 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఫ్లాట్ గా ప్రారంభమై 120 పాయింట్లు తగ్గింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 23 పాయింట్ల నష్టంతో 77,946వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 24,404 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 స్టాక్స్ లాభాలతో, 14 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్ 1.73 శాతం, ఇండిగో 1.39 శాతం, ఎల్టీ 1.16 శాతం, ఎయిర్టెల్ 1.14 శాతం, టెక్ మహీంద్రా 1.12 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టైటాన్ 1.52 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.52 శాతం, రిలయన్స్ 1.27 శాతం, అదానీ పోర్ట్స్ 1.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.95 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Aug 13 Gold Prices | మళ్లీ భగ్గుమంటున్న బంగారం ధరలు.. వడ్డీ రేట్లపై ఫోకస్