Sensex Nifty | సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్.. మిశ్రమంగా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అస్థిరంగా చలించింది. చివరికి సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sensex Nifty | అమెరికా -ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండడం, అపరిష్కృతంగా ఉన్న హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రవాణా అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. అయితే అమెరికా, భారతదేశం రెండింటిలోనూ ఊహించిన దానికంటే తక్కువ ద్రవ్యోల్బణం నమోదవడంతో కాస్త ఊరట చెందారు. దీంతో ఉదయం భారీ నష్టాల దిశగా సాగిన మార్కెట్లు.. చివరలో కోలుకున్నాయి.

Sensex Nifty | తీవ్ర ఒడిదుడుకులు..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. ఉదయం సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఎనిమిది పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద నిýదొక్కుకోలేక 456 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఫ్లాట్ గా ప్రారంభమై 120 పాయింట్లు తగ్గింది. అయితే మార్కెట్ ముగిసే సమయంలో సూచీలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో 78,079 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 24,395 వద్ద స్థిరపడ్డాయి.

Sensex Nifty | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,192 కంపెనీలు లాభపడగా 2,127 స్టాక్స్ నష్టపోయాయి. 226 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 167 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 95 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 19 స్టాక్ లాభపడగా.. 11 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇండిగో 2.86 శాతం, ఎన్టీపీసీ 2.01 శాతం, బీఈఎల్ 1.98 శాతం, ఎల్టీ 1.95 శాతం, హెచ్యూఎల్ 1.72 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ 0.95 శాతం, టైటాన్ 1.08 శాతం, రిలయన్స్ 0.80 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.73 శాతం, ఇన్ఫోసిస్ 0.50 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | మూడో సెషన్‌లోనూ నష్టాల్లోనే సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *