అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market Gains | పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు పెరుగుతున్నా, ఎఫ్ ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోయినా, రూపాయిలో బలహీనత కొనసాగుతున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్‌లోని బెంచ్ మార్క్ సూచీలు మాత్రం పుంజుకున్నాయి. కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో ఆయా స్టాక్స్ రాణిస్తున్నాయి. ప్రధానంగా బ్లూ చిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది.
Stock Market Gains | లాభాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 359 పాయింట్ల లాభంతో ప్రారంభమై తొలుత 109 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి కోలుకుని 743 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 37 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 239 పాయింట్లు లాభపడింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 919 పాయింట్ల లాభంతో 77,806 వద్ద, నిఫ్టీ 283 పాయింట్ల లాభంతో 24,279 వద్ద ఉన్నాయి.
Stock Market Gains | యుటిలిటీ, మీడియా రంగాలు మినహా..
యుటిలిటీ, మీడియా రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఆటో ఇండెక్స్ 2.15 శాతం, రియాలిటీ 1.83 శాతం, ఎఫ్ ఎంసీజీ 1.71 శాతం, ఎనర్జీ 1.55 శాతం, ఐటీ 1.33 శాతం, టెలికాం 1.32 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.26 శాతం లాభాలతో ఉన్నాయి. యుటిలిటీ ఇండెక్స్ 0.16 శాతం, మీడియా 0.10 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 స్టాక్స్ లాభాలతో, 4 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి 4.38 శాతం, ఐటీసీ 3.28 శాతం, టెక్ మహీంద్రా 3.25 శాతం, ఎం అండ్ ఎం 2.51 శాతం, రిలయన్స్ 2.38 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers : ఇండిగో 0.98 శాతం, ఆసియన్ పెయింట్ 0.13 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.13 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.02 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: April 29 Gold Rates | అతివలు ఆలోచించాల్సిందే.. బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల!


[…] […]