అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయనను ప్రశ్నించనున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు గతంలో భీమ్‌రెడ్డి నివాసాల్లో సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులను గుర్తించారు. జులై 7న ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను కస్టడీకి అప్పగించాలని నాంపల్లి ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీకి తీసుకున్నారు.
DSP Bhima Reddy | రూ.300 కోట్ల ఆస్తులు
హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పని చేసిన భీం రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించారు. ఆయనకు అనేక ప్లాట్లు, నివాసాలు, వాణిజ్య భవనాలు ఉన్నాయి. సంగారెడ్డి జహీరాబాద్‌లో 3.5 ఎకరాలు, వికారాబాద్ మోమిన్‌పేటలో 1,000 చదరపు గజాల ల్యాండ్ పార్సిల్‌తో పాటు 2 ఎకరాల వ్యవసాయ భూమి. సి.సి.కుంట ముచింతల గ్రామంలో 4 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కర్ణాటకలో ఒకచోట 6 ఎకరాలు, మరోచోట 38 ఎకరాల భారీ వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో 1 ఎకరం భూమి ఉంది.
దీనిని కూడా చదవండి : Urea Shortage Farmers | యూరియా కోసం కాళ్లు మొక్కిన రైతు