Revanth Reddy Comments | వడ్లు, మక్కలతో సమస్యలు.. సీఎం రేవంత్​ కీలక వ్యాఖ్యలు

వరి, మొక్కజొన్న సాగుతో సమస్యలు పెరుగుతున్నాయని సీఎం అన్నారు. రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరి (Paddy), మొక్కజొన్న (Maize) సాగుతో సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు.

సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్స్​లో నిర్వహించిన మహిళా సదస్సులో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. రూ.500 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలకు అందించే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అద్భుతంగా నడిపాయన్నారు. మిగతా ఎవరికిచ్చిన ప్రయోజనం లేదన్నారు. వడ్లు, మక్కలు మన సమస్యలను తీర్చవని, సమస్యలను పెంచుతున్నాయని పేర్కొన్నారు. పంట మార్పిడిపై మహిళలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. కందులు, మినుములు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలు సాగు చేయాలని సూచించారు. కూరగాయలు పండించాలని, పండ్ల తోటల పెంపకం చేపట్టాలన్నారు.

Revanth Reddy Comments | మహిళలకు ప్రత్యేక గుర్తింపు

మన సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం పేర్కొన్నారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చేందుకు వందల ఏళ్లు పట్టిందని, భారత్‌కు స్వాతంత్య్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత నెహ్రూదే అన్నారు. ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరు సంపాదించారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి గొప్పనేతలున్నారని గుర్తు చేశారు.

cm 1

Revanth Reddy Comments | బీజేపీ, బీఆర్​ఎస్​లపై విమర్శలు

దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని, ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం పేర్కొన్నారు. BJP 40ఏళ్ల రాజకీయాల్లో మహిళలను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేసిందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ (BRS) సైతం మహిళలను అధ్యక్షురాలు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్​ పాలనలో తొలి ఐదేళ్లు మహిళలకు మంత్రి పదవికూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో రాగానే సీతక్క, సురేఖలను మంత్రులు చేశామన్నారు. ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారమే పోతుందన్నారు.

దీనిని కూడా చదవండి : Anganwadi Salaries | అంగన్​వాడీలకు జీతాలు చెల్లించాలి: హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *