అక్షరటుడే వెబ్‌డెస్క్: CBSE Three Language Policy | పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయంపై సీబీఎస్‌ఈ ( CBSE )తాజా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడు భాషలు అభ్యసించాలనే నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది.
CBSE Three Language Policy | సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయాలు..
సీబీఎస్‌ఈ తీసుకున్న ముఖ్య నిర్ణయాల ప్రకారం, ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది, వారు ఈ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అలాగే, ప్రస్తుతం 7 నుంచి 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి చేరుకున్నప్పుడు, వారు అభ్యసించే మూడవ భాషకు బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. ఈ మూడవ భాషకు సంబంధించి విద్యార్థులకు కేటాయించే మార్కులు, పాఠశాలల్లో వారు కనబరిచిన ప్రతిభ , అంతర్గత పనితీరు (Internal assessment) ఆధారంగానే నిర్ణయించారు. ఇక 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ, వారు రెండు విదేశీ భాషలతో పాటు ఒక భారతీయ భాషను చదువుకునే అవకాశాన్ని బోర్డు కల్పించింది.

CBSE Three Language Policy | నిర్ణయం వెనుక కారణం..
ఇటీవల 9వ తరగతి విద్యార్థులందరూ తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్‌ఈ జారీ చేసిన ఆదేశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు బోర్డు ఈ సడలింపులను ప్రకటించింది. సీబీఎస్‌ఈ అకడమిక్స్ డైరెక్టర్ ప్రజ్ఞా ఎం. సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులపై అనవసర ఒత్తిడిని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఇది కూడా చదవండి: Nizamabad Rural Police | వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపుదాడి