Oppo Find X9S | అధునాతన ప్రాసెసర్‌తో మరో ఫోన్.. ఫైండ్ ఎక్స్ 9 ఎస్ లాంచ్ చేసిన ఒప్పో

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oppo Find X9S | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో.. తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్ 9 ఎస్ పేరుతో అధునాతన ప్రాసెసర్, భారీ బ్యాటరీతో తీసుకువచ్చిన ఈ ఫోన్.. మే 28 నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon)తోపాటు ఒప్పో స్టోర్‌లలోనూ అందుబాటులో ఉండనుంది. దీని స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..

డిస్‌ప్లే : 6.59 అంగుళాల 1.5కే ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది.

Oppo Find X9S | చిప్‌సెట్ ..

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ ప్రాసెసర్ అమర్చారు. ఇది హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస16తో పనిచేస్తుంది.

Oppo Find X9S | కెమెరా సెటప్..

వెనకవైపు 50ఎంపీ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో కూడిన త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇవి ప్రతి ఫొటోను చాలా షార్ప్‌గా, కలర్‌ఫుల్‌గా క్యాప్చర్ చేస్తాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం : 7,025 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

వేరియంట్స్ : లావెండర్ స్కై, మిడ్‌నైట్ గ్రే సన్‌సెట్ ఆరెంజ్ రంగుల్లో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది.
12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.79,999.
12 జీబీ, 512 జీబీ వేరియంట్ ధర రూ.89,999.

కార్డ్ ఆఫర్స్ : ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్టులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Honda City Facelift | లీటరుకు 27 కి.మీ. మైలేజీ!.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *