Kamareddy Theft Arrest | ఆర్థిక ఇబ్బందులతో చోరీల బాట.. నిందితుడి అరెస్ట్

ఆర్థిక ఇబ్బందులు, ఆపై అప్పులు బాధ తీవ్రం కావడంతో ఓ వ్యక్తి చోరీ మార్గాన్ని ఎంచుకున్నాడు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Arrest | ఆర్థిక ఇబ్బందులు, ఆపై అప్పులు బాధ తీవ్రం కావడంతో ఓ వ్యక్తి చోరీ మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరికి పోలీసులకు(Kamareddy ) చిక్కి కటకటాల పాలయ్యాడు. ఎస్పీ రాజేష్ చంద్ర(Sp Rajesh Chandra) మీడియాకు వివరాలు వెల్లడించారు.

Kamareddy Theft Arrest | దేవునిపల్లి విద్యుత్​నగర్​..

దేవునిపల్లి విద్యుత్ నగర్ కాలనీకి చెందిన మామిండ్ల లావణ్య గత నెల 7న ఉదయం 8.30 గంటలకు ఇంటికి తాళం వేసి తల్లి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపు గొళ్లెం పగిలి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం కూడా పగలగొట్టి ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ మధుసూదన్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుమానితుడి కదలికలను గుర్తించారు. శనివారం మధురానగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న దేవునిపల్లి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్​గా గుర్తించారు. తనకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.

Kamareddy Theft Arrest | ఇనుప రాడ్​తో పగులగొట్టి..

తాళం వేసిన ఇంటిని గమనించిన శ్రీనివాస్​ ఇనుప రాడ్​తో తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డాడు.  బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.90 వేల నగదును అపహరించినట్లు తెలిపాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి బంగారు నల్లపూసల తాడు, రెండు బంగారు గొలుసులు, ఏడు బంగారు ఉంగరాలు, ఒక జత కమ్మల బుట్టలు, మూడు జతల కమ్మలు, రెండు గోల్డ్ బిస్కెట్లు, నాలుగు చిన్న గోల్డ్ బిస్కెట్ ముక్కలు, ఒక మొబైల్ ఫోన్ మరియు 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి ఆస్తులను రికవరీ చేయడంలో సమర్థవంతంగా పనిచేసిన డీఎస్పీ మధుసూదన్, సీఐలు శ్రీధర్ గౌడ్, రామన్, ఎస్సైలు  రంజిత్, మహేష్ తో పాటు సిబ్బంది రాజేందర్, రవి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, రవికిరణ్, రవిలను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

ఇది కూడా చదవండి: Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *