Nizamabad Welfare Development | సంక్షేమాభివృద్ధిలో నిజామాబాద్​ జిల్లా ముందంజ: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Welfare Development | సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి (Sudarshan Reddy) పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పెరేడ్​ గ్రౌండ్​లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు.

Nizamabad Welfare Development | వ్యవసాయంలో పురోగతి..

వానాకాలం–2026లో ఇప్పటివరకు వరి 3,87,000 ఎకరాల్లో, మొక్కజొన్న 52 వేలు, సోయా 35 వేలు, కంది 900ఎకరాల్లో రైతులు సాగు చేశారన్నారు. భూములను సారవంతంగా ఉంచడానికి పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ విత్తనాలు 4,192 క్వింటాళ్లు, జనుము 136 క్వింటాళ్లు 50శాతం రాయితీపైన వివిధ మండలాలలోని సొసైటీల ద్వారా రైతులకు పంపిణి చేయడం జరిగిందన్నారు.

Nizamabad Welfare Development | ఎరువులు..

జిల్లాలో వానాకాలం 2026 సీజనుకు గాను ఇప్పటి వరకు రైతులకు యూరియా 42,983 మెట్రిక్​ టన్నులు జమ చేశామని సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు. అలాగే డీఏపీ 11,554 టన్నులు, పొటాష్ 1,913 టన్నులు, కాంప్లెక్స్ 38,067 మెట్రిక్ టన్నుల ఎరువులు ఎటువంటి కొరత లేకుండా, సరైన సమయంలో సరైన మోతాదుతో సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా 16,477, డీఏపీ 860, పోటాష్ 2,786 మెట్రిక్​ టన్నులు, కాంప్లెక్స్ 13,325 మెట్రిక్ టన్నుల ఎరువులు నిలువ ఉన్నాయని వివరించారు.

Nizamabad Welfare Development | రైతు భీమా..

జిల్లాలో 2025-26లో ఇప్పటివరకు రైతు బీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 786 రైతులకు సంబంధించిన వారి వారి నామిని బ్యాంకు ఖాతాలలో రూ.39కోట్లు జమ చేశామని వివరించారు. రైతు భరోసాలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్దారించి ఎకరాకు సీజనుకు 6 వేల చొప్పున ఏడాదికి 12 వేల రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. వానాకాలం 2026 సీజనుకు గాను జిల్లాలో 2 లక్షల 75 వేల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.316 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం చేశామని వివరించారు.

Nizamabad Welfare Development | పౌర సరఫరాల శాఖలో..

జిల్లాలో 4,77,780 ఆహార భద్రత కార్డుల ద్వారా 16,09,447 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని ప్రభుత్వ సలహాదారు పేర్కొన్నారు. మహా లక్ష్మి పథకంలో రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అర్హులైన లబ్దిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా జిల్లాలో 16,924 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Development | అభివృద్ధిలో దూసుకుపోతున్న కామారెడ్డి : వీహెచ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *