Ponguleti Srinivas Reddy Visit | జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.. ఏర్పాట్లపై కలెక్టర్ ​సమీక్ష

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్​లో పర్యటించనున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Ponguleti Srinivas Reddy Visit | రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్​లో (Nizamabad) పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్​ భవేష్​ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.

Ponguleti Srinivas Reddy Visit | నాగారంలో హౌసింగ్​ టవర్స్​..

నాగారంలోని నిర్మితి కేంద్రం వద్ద హౌసింగ్ టవర్స్ నిర్మాణం కోసం ఉదయం 7గంటలకు మంత్రి స్థల పరిశీలన జరపనున్నారు. అనంతరం 43వ డివిజన్ పాములబస్తీలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో భేటీ కానున్నారు. ఉదయం 10.00 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అక్కడి నుండి గూపన్​పల్లికి చేరుకొని తహశీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అదేవిధంగా దుబ్బ ప్రాంతంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Ponguleti Srinivas Reddy Visit | ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష

ఉదయం 11.45 గంటల ప్రాంతంలో కలెక్టరేట్​కు చేరుకుని హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్ భుజంగరావు,ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్​వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీవో సందీప్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Alaska Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *