అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Singapore Education Tour | సింగపూర్ పాఠశాలల విద్యా విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించే విదేశీ అధ్యయన పర్యటనకు ప్రతి జిల్లా నుండి ఎంపిక చేసిన ఉపాధ్యాయుల బృందాన్ని పంపుతోంది.
Singapore Education Tour | నిజామాబాద్ జిల్లా నుంచి..
ఈ పర్యటనకు నిజామాబాద్ (Nizamabad) జిల్లా నుండి సుద్ధపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, డిచ్‌పల్లి డివిజన్ మండల విద్యాధికారి గోషికొండ నరేష్ ఎంపికయ్యారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సెలక్షన్ కమిటీ ఆయనను ఈ పర్యటనకు పంపుతోంది. సింగపూర్ పాఠశాలల్లోని నూతన విద్యావిధానాలు, సాంకేతికతను అధ్యయనం చేసి, వాటిని మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం భావిస్తోంది.
నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తా
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశానికి హెచ్‌ఎం గోషికొండ నరేష్ ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ విద్యావ్యవస్థలో ఉపయోగిస్తున్న నూతన సాంకేతిక బోధనా పద్ధతులను లోతుగా అధ్యయనం చేసి, తిరిగి వచ్చాక మన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సులభతరమైన, నాణ్యమైన బోధన అందించేలా కృషి చేస్తానని చెప్పారు. తనను ఈ పర్యటనకు ఎంపిక చేసిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి..: ABVP Protest Kamareddy | ఏబీవీపీ ధర్నాతో కామారెడ్డి రణరంగం