Manipur Assam Rifles | మణిపూర్‌లో ఉగ్రదాడి.. అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్ల దుర్మరణం

దాడి అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ అధీనంలోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Manipur Assam Rifles | మణిపూర్‌లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉఖ్రుల్ జిల్లాలో అసోం రైఫిల్స్‌కు చెందిన జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్)తో దాడి చేసినట్లు సమాచారం.

Manipur Assam Rifles | భద్రతా బలగాల అధీనంలోకి..

ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన సిబ్బందిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం

దాడి అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిని తమ అధీనంలోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. మృతుల వివరాలు, దాడికి బాధ్యులెవరు అనే అంశాలపై అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *