Aug 04 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు..గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 04 Market Analysis | అమెరికా – ఇరాన్ మధ్య చర్చల విషయంలో అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండటంతో భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్(Sensex), నిఫ్టీ మంగళవారం బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Aug 04 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

తగ్గుతున్న చమురు ధరలు, ప్రముఖ టెక్నాలజీ స్టాక్‌లలో ర్యాలీ మద్దతుతో వాల్‌స్ట్రీట్ పరుగులు తీసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 2.13 శాతం, ఎస్ అండ్ పీ 1.48 శాతం లాభపడ్డాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.24 శాతం లాభంతో ఉంది.

Aug 04 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.36 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.21 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.4 శాతం పెరిగాయి.

Aug 04 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.63 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.22 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.66 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.61 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.48 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.16 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.11 శాతం నష్టంతో ఉండటంతో మన మార్కెట్లు గ్యాప్ ఫ్లాట్ టు గ్యాప్ డౌన్​లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

NTR Dragon Shoot | నాన్‌స్టాప్‌గా డ్రాగన్ షూటింగ్.. కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్

గమనించాల్సిన అంశాలు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఐదో సెషన్‌లోనూ తమ కొనుగోళ్ల పరంపరను కొనసాగించారు. గత సెషన్‌లో నికరంగా రూ. 922 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.

  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 95.34 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.99 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.69 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.39 నుంచి 1.40 కు పెరిగింది.
  • విక్స్ 1.45 శాతం పెరిగి 11.92 వద్ద ఉంది.

క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 84.59 డాలర్ల వద్ద ఉంది.
ఎయిర్‌టెల్, ఓఎన్జీసీ, నైకా, బీఎసఈ, ఎంసీఎక్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, మారికో వంటి కంపెనీలు ఈ రోజు తమ 2026 మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం కొనసాగుతోంది. సమావేశం తీర్మానాలను ఆగస్టు 5న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించనున్నారు. వడ్డీ రేట్లపై నిర్ణయంతోపాటు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ఆర్బీఐ ఎలాంటి కామెంట్లు చేస్తుందోనని మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *