అక్షరటుడే, వెబ్డెస్క్: Aug 04 Horoscope | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ (మంగళవారం, ఆగస్టు 04) చంద్రుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో రేవతి, అశ్విని నక్షత్రాల ప్రభావం సర్వత్రా ఉంటుంది. అలాగే గురుడు, చంద్రుల మధ్య నవ పంచమ స్థితి ఏర్పడి, అది అద్భుతమైన గజకేసరి యోగానికి దారితీస్తుంది.
ఈ శుభ యోగాల వల్ల ముఖ్యంగా మేషం, మిథున రాశులతో పాటు పలు రాశుల వారికి అత్యంత అనుకూల ఫలితాలు రానున్నాయి. కుజుడు, బుధుడి శుభ ప్రభావంతో వ్యాపారస్తులకు నూతన ఉత్తేజం, మంచి లాభాలు లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొన్ని రాశులకు ధన లాభం కలగనుండగా, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ, ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చు.
Aug 04 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Aug 04 Horoscope | ఇవాళ మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విచారణలు, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మీలో మానసిక ధైర్యం, ఉత్సాహం రెట్టింపవుతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను ఇస్తాయి. వ్యాపారంలో అనుకోకుండా వచ్చే లాభాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
వృషభ రాశి: Aug 04 Horoscope | అనేక రంగాల్లో విజయం సాధించి సానుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం నిండుతుంది. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు.
తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు, సహకారం లభిస్తాయి. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. మీ శక్తి కొద్దీ చేసే దానధర్మాలు మీకు మరింత శ్రేయస్సును కలిగిస్తాయి.
మిథున రాశి: Aug 04 Horoscope | బుధ, కుజ గ్రహాల శుభ దృష్టి వల్ల మీకు అత్యంత అనుకూలమైన రోజు. చంద్రుడి ప్రభావంతో తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు వ్యాపార విస్తరణకు బాగుంటుంది.
నూతన ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. ఉద్యోగులకు ఆఫీసులో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. కెరీర్‌లో మంచి ఎదుగుదల కనిపిస్తుంది.
కర్కాటక రాశి: Aug 04 Horoscope | గజకేసరి యోగం వల్ల మీకు బాగా కలసివస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి (ప్రమోషన్) వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.
మీ మృదువైన సంభాషణ తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల గురించిన సమాచారం అందుతుంది.
సింహ రాశి: Aug 04 Horoscope | రోజంతా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే మెరుగైన లాభాలు గడిస్తారు.
దీనివల్ల ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సీనియర్లు, గురువుల సలహాలు పాటిస్తే మంచి విజయాలు సాధించవచ్చు.
కన్యా రాశి: Aug 04 Horoscope | ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆఫీసులో బాధ్యతల భారం పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువుల కోసం అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తులా రాశి: Aug 04 Horoscope | ఈ రాశి వారు సప్తమ స్థానంలో (మేష రాశి) చంద్రుని సంచారం వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి.
మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ మంచి విజయం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అందుతాయి. ఇవాళ శ్రీ దుర్గా చాలీసా పఠించండి.
వృశ్చిక రాశి: Aug 04 Horoscope | విలువైన వస్తువు లేదా ఆస్తి ద్వారా లాభం పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో హోదా, అధికారాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ధైర్యసాహసాల ముందు శత్రువులు నిలబడలేరు. సమాజంలో గౌరవం లభిస్తుంది, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు.
ధనస్సు రాశి: Aug 04 Horoscope | ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. గురువుల పట్ల ఉన్న భక్తి విశ్వాసాల వల్ల మీ మేధస్సు, ఆలోచనా శక్తి మెరుగుపడతాయి. కొత్త ఆవిష్కరణలు లేదా సృజనాత్మక పనుల్లో నిమగ్నమవుతారు.
రావలసిన ధనం తిరిగి చేతికి అందుతుంది. అయితే, సాయంత్రం వేళ పిల్లలకు కొన్ని అనూహ్యమైన సమస్యలు ఎదురుకావచ్చు. నమ్మకస్తులైన వ్యక్తులు ద్రోహం చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: Aug 04 Horoscope | కుటుంబ సభ్యుల మద్దతుతో రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించిన వార్తలు వినే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీకు ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినా, మీ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుంది.
భారీ స్థాయిలో ఆదాయం సమకూరినప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఉంటాలి.
కుంభ రాశి: చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారులకు ఇది అనుకూల సమయం. ఆర్థిక స్థితి బలపడటం వల్ల భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవివాహితులకు అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి.
మీన రాశి: ఇవాళ కొంత ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అప్పు, రుణం తీసుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రణాళికలు వేసి వాటిని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగడం వల్ల వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు.