Narayana College | నారాయణ జూనియర్​ కళాశాల సీజ్​..

నగరంలో నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు విక్రయిస్తున్న ఆరోపణపై నారాయణ కళాశాలను సీజ్​ చేశారని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Narayana College | నగరంలో నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు విక్రయిస్తున్న ఆరోపణపై నారాయణ కళాశాలను సీజ్​ చేశారని ఏబీవీపీ( abvp protest ) నాయకులు పేర్కొన్నారు. కళాశాలను శుక్రవారం సందర్శించిన డీఐఈవో (DIEO Ravi kumar) రవికుమార్​ పుస్తక విక్రయాలను గుర్తించి సీజ్​ చేశారన్నారు.

Narayana College | పుస్తకాలు.. యూనిఫార్మ్​లు అధిక రేట్లకు…

ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ నారాయణ కళాశాలలో( Intermediate Education ) యూనిఫార్మ్స్, బుక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా కళాశాల బిల్డింగ్​కు పర్మిషన్ లేకున్నా కళాశాల నడుపుతున్నారన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్న నారాయణ కళాశాల గదిని, కళాశాలను డీఐఈవో సీజ్​ చేశారన్నారు.

జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాంటి కాలేజీలు, బడులపై చర్యలు తీసుకోవాలన్నారు.  లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ మందపల్లి అక్షయ్, సమీర్, దుర్గా దాస్, సిద్దు, మున్నా, ప్రణీత్ తేజ, శివ, టిల్లు, సన్నీ, అశ్విత్, విగ్నేష్, చరణ్, మనోహర్,తదితరులు పాల్గొన్నారు.

coll3 1

ఇది కూడా చదవండి : Ponguleti Srinivasa Reddy | ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *