Lemon Juice Benefits | నిమ్మకాయను కూరల్లో ఇలా పిండుతున్నారా? అయితే పోషకాలు ఆవిరైనట్లే!

నాన్ వెజ్ లేదా బిర్యానీ లాంటి కారంగా ఉండే వంటకాలపై నిమ్మరసం పిండుకుని తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Lemon Juice Benefits | నాన్ వెజ్ లేదా బిర్యానీ లాంటి కారంగా ఉండే వంటకాలపై నిమ్మరసం పిండుకుని తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. అయితే, ఇది కేవలం రుచిని పెంచడానికే కాకుండా.. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, నిమ్మరసం వాడేటప్పుడు చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు వల్ల దానిలోని పోషకాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.

Lemon Juice Benefits | కలిగే ప్రయోజనాలు..

నిమ్మలోని విటమిన్-సి శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను చురుకుగా మారుస్తుంది. దీనివల్ల ఎంత బరువైన (హెవీ) ఆహారమైనా త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా, నిమ్మలో ఉండే ఫైబర్ గుణాలు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉండే వారికి లేదా రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. పాలకూర, పప్పుధాన్యాలు, శనగలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలపై నిమ్మరసం పిండుకుని తినడం ద్వారా, ఆ ప్లాంట్ బేస్డ్ ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహించేలా నిమ్మలోని విటమిన్-సి దోహదపడుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య నుంచి సులువుగా ఉపశమనం లభిస్తుంది.

Lemon Juice Benefits | చేయకూడని పెద్ద తప్పు..

చాలామంది కూరలు పొయ్యిపై ఉడుకుతున్నప్పుడే లేదా బాగా వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం పిండేస్తుంటారు. ఇది అస్సలు చేయకూడదు. నిమ్మకాయలోని విటమిన్-సి ( Vitamin C )అధిక వేడికి చాలా త్వరగా నశిస్తుంది. ఆహారం ఉడుకుతున్నప్పుడు నిమ్మరసం వేస్తే అందులోని పోషకాలన్నీ వేడికి ఆవిరైపోతాయి. కాబట్టి వంట పూర్తయి, పొయ్యి ఆఫ్ చేసి, కూర కాస్త చల్లారిన తర్వాత లేదా ప్లేట్‌లో వడ్డించుకున్నాకే పైన నిమ్మరసం పిండుకోవడం మంచిది. రోజూ ఆహారంలో సరైన పద్ధతిలో నిమ్మరసాన్ని చేర్చుకోవడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  House Maid Theft | ఇళ్లను దోచేస్తున్న పని మనుషులు.. హైదరాబాద్​ పోలీసుల వార్నింగ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *