BJP MLAs Protest | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన

అసెంబ్లీలో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. 22ఏ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP MLAs Protest | తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బీఆర్​ఎస్​ నిరసనతో అసెంబ్లీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారగా.. హాల్​లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.

సభ ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. 22Aపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. భూ దందాలపై విచారణ జరిపించాలని ఆందోళన చేశారు. దీంతో స్పీకర్​ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

BJP MLAs Protest | చర్చకు సిద్ధం

సమావేశాల్లో 22Aపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించామని మంత్రి శ్రీధర్​ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. A నుంచి Z వరకు మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఏం అంశమైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు చర్చకు సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: BRS MLAs Arrest | అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *