Hyundai Smart Care Clinic | హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్.. ఉచిత 50-పాయింట్ చెకప్‌తో పాటు కస్టమర్లకు లభించే ఆఫర్లు ఇవే!

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) దేశవ్యాప్తంగా 'హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్' (Hyundai Smart Care Clinic) సర్వీస్ క్యాంప్‌ను ప్రకటించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyundai Smart Care Clinic | హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) దేశవ్యాప్తంగా ‘హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్’ (Hyundai Smart Care Clinic) సర్వీస్ క్యాంప్‌ను ప్రకటించింది. 2026 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 8 వరకు 15 రోజుల పాటు ఈ ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. ముఖ్యంగా చలికాలంలో వాహనాలను అత్యుత్తమ స్థితిలో ఉంచుకోవడం, క్రమం తప్పని నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కస్టమర్లకు ఉచిత 50-పాయింట్ వెహికల్ హెల్త్ చెకప్‌తో పాటు, పీరియాడిక్ మెయింటెనెన్స్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇతర వ్యాల్యూ-యాడెడ్ సర్వీసులపై ఆకర్షణీయమైన రాయితీలు లభిస్తాయి.

Hyundai Smart Care Clinic | నీలేష్ షా స్పందన..

కస్టమర్లకు సంతృప్తికరమైన, ఇబ్బందులు లేని వాహన నిర్వహణ అనుభవాన్ని అందించడం తమ నిబద్ధతలో ప్రధాన భాగమని హ్యుందాయ్ మోటార్ ఇండియా నేషనల్ సర్వీస్ హెడ్ నీలేష్ షా తెలిపారు. ముందస్తు వాహన సంరక్షణ, సౌలభ్యం, అదనపు ప్రయోజనాలను ఈ స్మార్ట్ కేర్ క్లినిక్ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్త సర్వీస్ నెట్‌వర్క్, నిపుణుల సహకారంతో కస్టమర్ల వాహనాలను చక్కగా నిర్వహించడంతో పాటు, ప్రతి దశలోనూ వారికి భరోసా కల్పిస్తామని చెప్పారు.

Hyundai Smart Care Clinic | క్యాంప్ ప్రత్యేకతలు..

నివారణ వాహన సంరక్షణ, ప్రత్యేక ప్రయోజనాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఇంజిన్, బ్రేకులు, ఎలక్ట్రికల్ సిస్టమ్, సస్పెన్షన్‌తో కూడిన 50-పాయింట్ వెహికల్ చెకప్‌ను కస్టమర్లకు పూర్తిగా ఉచితంగా అందిస్తారు. క్రమం తప్పని నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రయాణాలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Hyundai Smart Care Clinic | ఆకర్షణీయమైన రాయితీలు..

శిబిరంలో పాల్గొనే సర్వీస్ సెంటర్లలో వాహనదారులకు అనేక ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మెకానికల్ లేబర్ ఛార్జీలపై గరిష్ఠంగా 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుండగా, ఎక్స్‌టెండెడ్ వారంటీపై 15 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. అలాగే మెకానికల్, మెయింటెనెన్స్ విడిభాగాలపై 10 శాతం తగ్గింపు, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA)పై 15 శాతం రాయితీ పొందవచ్చు. వీటితో పాటు ఇంటీరియర్ ఎన్రిచ్‌మెంట్, ఎక్స్‌టీరియర్ బ్యూటిఫికేషన్, సిరామిక్ కోటింగ్ వంటి వ్యాల్యూ-యాడెడ్ సర్వీసులపై 15 శాతం తగ్గింపు అందిస్తున్నారు.

Hyundai Smart Care Clinic | 1,700కు పైగా సర్వీస్ సెంటర్లలో ..

దేశవ్యాప్తంగా ఉన్న 1,700కు పైగా అధీకృత హ్యుందాయ్ సర్వీస్ సెంటర్లలో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 8, 2026 వరకు ఈ సర్వీస్ క్యాంప్ కొనసాగుతుంది. వాహనదారులు తమ సమీపంలోని హ్యుందాయ్ సర్వీస్ కేంద్రాన్ని సంప్రదించి ఈ ఉచిత తనిఖీలు, ప్రత్యేక రాయితీలను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Akula Kalpana Appointment | మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఆకుల కల్పన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *