Akula Kalpana Appointment | మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఆకుల కల్పన

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలిగా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆకుల కల్పన నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Akula Kalpana Appointment | కామారెడ్డి జిల్లా (Kamareddy District) మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలిగా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆకుల కల్పన నియమితులయ్యారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గాంధీభవన్ లో నియామక పత్రాన్ని సోమవారం అందచేశారు.

Akula Kalpana Appointment | పార్టీకోసం కష్టపడతా..

ఈ సందర్భంగా ఆకుల కల్పన మాట్లాడుతూ తన పై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ఆకుల కల్పన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో మహిళా కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. సభ్యత్వం నమోదుతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోనికి తీసుకెళ్తానన్నారు.

తనను కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ భవన్ లో ఆకుల కల్పనకు రాష్ట్ర అధ్యక్షారాలిచే నియామక పత్రం అందచేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్, ఎల్లారెడ్డి నియోజక వర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అరుణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గాంధారి మాజీ ఎంపిపి ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad New PACS | సహకార రంగంలో కొత్తశకం..! నిజామాబాద్ జిల్లాకు ఐదు కొత్త పీఏసీఎస్‌లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *