Hyderabad Fire Department | అగ్నిమాపక ఉద్యోగుల సంఘం హైదరాబాద్​ కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ​హైదరాబాద్: Hyderabad Fire Department | తెలంగాణ (Telangana) అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ వేదికగా రాష్ట్ర అడ్-హక్ కమిటీ అధ్యక్షుడు జి. దామోదర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వి. వెంకటేష్, తిరుమల్ రెడ్డి, కోశాధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.

​Hyderabad Fire Department | నూతన కార్యవర్గం ఇదే..

అసోసియేషన్​ ​అధ్యక్షుడిగా వి. వెంకటేష్, ​ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, కె. శివకుమార్, ​కార్యదర్శిగా కె. వెంకటేష్, ​కోశాధికారిగా ఎస్. శ్రీకాంత్, ​సహాయ కార్యదర్శులుగా జె. శ్రీనాథ్, రమావత్ శ్రీను, ​ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామకృష్ణ యాదవ్, ​కల్చరల్ సెక్రటరీగా కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే ​సలహాదారులుగా సుల్తాన్ ప్రదీప్ (ఎస్‌ఎఫ్‌వో), ఎస్. సత్యనారాయణ (ఎల్‌ఎఫ్‌ఎఫ్), ​కార్యవర్గ సభ్యులుగా ఎల్. మధు చారి, కమలేశ్వర్ దయాల్, లోకేశ్వర్, ఎం. హేమంత్ కుమార్, షేక్ ఐజాజ్ అహ్మద్, ఎం. ప్రవితన్, మహ్మద్ అబ్దుల్ అర్షద్ ఎన్నికయ్యారు.

Hyderabad Fire Department | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి..

​ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వి. వెంకటేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. శాఖలోని అన్ని స్థాయుల ఉద్యోగుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గానికి పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

4354343 1

ఇది కూడా చదవండి: ఏనుగు విగ్రహం మధ్యలో..ఇరుక్కున్న భక్తుడు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *