Revanth Reddy | ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు.. సీఎం కీలక వ్యాఖ్యలు

పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలుసని, వారి చిట్టా తన వద్ద ఉందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy | కాంగ్రెస్​లో పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల అసమ్మతి రాగం అందుకున్న విషయం తెలిసిందే. నేరుగా ప్రభుత్వంపై, సీఎంపై విమర్శలు చేస్తున్నారు. నాయకుల వ్యాఖ్యలపై తాజాగా సీఎం రేవంత్​ రెడ్డి స్పందించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు ఏం చేస్తున్నారనే విషయం తనకు తెలుసన్నారు. ప్రతి ఒక్కరి చిట్టా తన దగ్గర ఉందని స్పష్టం చేశారు.

Revanth Reddy | వారికే టికెట్లు

పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎదురుగా వచ్చి డిస్కో డ్యాన్స్ చేసిందంట అని అసమ్మతి నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి ఆటలు అన్ని సందర్భాల్లో సాగవన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని తాము గుర్తిస్తామని చెప్పారు. పార్టీని దెబ్బతీయడానికి కష్టపడే వారిని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు.

Revanth Reddy | 90 సీట్లు లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు లక్ష్యంగా ముందకు సాగాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ చీరలు కోటి మందికి ఇస్తున్నామని, కోటి మందికి బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని, మిగతా లెక్కలు తమకు వదిలేయాలన్నారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడాల్సి ఉంటుందని అన్నారు.

దీనిని కూడా చదవండి : BJP RSS Ideology | బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిప్పికొట్టాలి : ఏఐసీసీ ఇన్​ఛార్జి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *