BJP RSS Ideology | బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిప్పికొట్టాలి : ఏఐసీసీ ఇన్​ఛార్జి

బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ భావజాలాన్ని తిప్పికొట్టాలని ఏఐసీసీ ఇన్‌చార్జి బి. సందీప్ కుమార్ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP RSS Ideology | బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ భావజాలాన్ని తిప్పికొట్టాలని ఏఐసీసీ ఇన్‌చార్జి బి. సందీప్ కుమార్ అన్నారు. తెలంగాణలో సమష్టి కృషితో గత ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.

గాంధీ భవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బి. సందీప్ కుమార్ అధ్యక్షతన పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) అడ్వైజరీ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, తదితరులు హాజరయ్యారు. ఏఐసీసీ ఇన్​ఛార్జి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులు అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు.

BJP RSS Ideology | రాహుల్​ను ప్రధాని చేయాలి

రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసేందుకు మరింత కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని కాంగ్రెస్​ నాయకులు తిప్పికొట్టాలన్నారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్​ ప్రభుత్వం రావడమే లక్ష్యంగా పనిచేయాలని మహేశ్​ గౌడ్​ అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

దీనిని కూడా చదవండి : Ind vs NZ Test | ముగిసిన నాలుగో రోజు ఆట.. 233 పరుగుల లీడ్​లో భారత్​

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *