Ind vs NZ Test | ముగిసిన నాలుగో రోజు ఆట.. 233 పరుగుల లీడ్​లో భారత్​

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో భారత ఆటగాళ్లు విజృంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ind vs NZ Test | న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​ ( Ind vs NZ Test)లో భారత ఆటగాళ్లు విజృంభించారు. తొలి ఇన్నింగ్స్​లో భారీ స్కోర్​ చేశారు. 720 పరుగులకు డిక్లేర్డ్​ చేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్​ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

తొలి టెస్ట్​లో భారత్ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్​ 368 పరుగులకు ఆలౌట్​ అయింది. అనంతరం ఆట ప్రారంభించిన భారత్​ భారీ స్కోర్​ చేసింది. కేఎల్​ రాహుల్ (136), రిషబ్​ పంత్​ (128) సెంచరీలతో చెలరేగారు. మరోవైపు కెప్టెన్​ గిల్ (Gill)​ 98 పరుగుల వద్ద ఔట్ అయి తృటిలో శతకం మిస్​ అయ్యాడు. జైస్వాల్ 85, పడిక్కల్​ 80, అన్షుల్ కాంబోజ్​ 38, ద్రువ్ జురేల్ 78, వాషింగ్టన్​ సుందర్ 24 పరుగులు చేశారు. అందరు ఆటగాళ్లు రాణించడంతో భారత్ భారీ స్కోర్​ చేసింది. 710/9 వద్ద టీం ఇండియా డిక్లేర్​ చేసింది.

Ind vs NZ Test | గెలుపు దిశగా..

రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే షాక్​ తగిలింది. తొలి ఓవర్​లోనే ఓపెనర్​ టామ్​ లాథమ్​ డకౌట్​ అయ్యాడు. హెన్రీ నికోల్స్​ (31) ప్రసిద్​ కృష్ణ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్​ 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే (54), రచిన్ రవీంద్ర (27) ఉన్నారు. భారత్​ ప్రస్తుతం 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు మిగిలిన 8 వికెట్లు తీస్తే భారత్​ గెలుస్తుంది. లేదంటే మ్యాచ్​ డ్రా అవుతుంది.

 

ఇది కూడా చదవండి : Rajasthan Accident | రాజస్థాన్​లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *