అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajasthan Accident | రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఫోర్స్ క్రూయిజర్ వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయారు.
మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం రాజస్థాన్‌లోని ఖాటు శ్యామ్‌జీని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి పూట డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం చోటుకుంది. ఆ సమయంలో వాహనంలో 15 మంది ఉన్నారు. మృతులను ఉషా బాయి, సుశీల, కైలాష్, సాన్వి, సజ్జన్, అనితా, బాబులాల్, జాహ్నవి, మాధవిగా గుర్తించారు. వీరిలో ఇద్దరు సోదరులు, వారి భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. మరో ఆరుగురు గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Rajasthan Accident | గుజరాత్లో..
గుజరాత్ (Gujarat)లోని కచ్ జిల్లాలో భుజ్-ఖావ్‌డా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు చనిపోయారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులు ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. వారు ‘రాన్ ఆఫ్ కచ్’ను సందర్శించి భుజ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతానికి చెందినవారు.
దీనిని కూడా చదవండి : TGSPDCL ACB Trap | రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిన సబ్ ఇంజినీర్