Vikarabad Accident | వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

వికారాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikarabad Accident | వికారాబాద్​ (Vikarabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం బుగ్గరామేశ్వరం దగ్గర లారీ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Vikarabad Accident | తీవ్ర విషాదం

పెండ్లిమడుగు నుంచి కేరెళ్లికి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోయారు. మృతులను చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత, నాగేష్ గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దీనిని కూడా చదవండి : CBI Raid | జీఎస్​టీ సూపరింటెండెంట్​ ఇంట్లో నోట్ల కట్టలు స్వాధీనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *