అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI Raid | హర్యానాలోని పంచకుల వద్ద పనిచేస్తున్న సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (CGST) సూపరింటెండెంట్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో భారీగా నగదు, ఆభరణాలు స్వాధృనం చేసుకున్నారు.
ప్రైవేట్ సంస్థకు సంబంధించి GST వ్యవహారాల్లో అక్రమ ప్రయోజనాలు కల్పించేందుకు సూపరింటెండెంట్ లంచం డిమాండ్ చేశాడు. రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు ఆయనను ఈ నెల 19న పట్టుకున్నారు. అనంతరం తాజాగా ఆయన నివాసాల్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల సమయంలో నిందితుడి అక్రమాస్తులు చేసి అధికారులే విస్తుపోయారు.
CBI Raid | విదేశీ కరెన్సీ..
ఆయన నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) జరిపిన సోదాల్లో సుమారు రూ. 1.86 కోట్ల విలువైన నగదు, విదేశీ కరెన్సీ, బంగారం, వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 24.29 లక్షల భారతీయ కరెన్సీ, సుమారు రూ. 15.65 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, అలాగే సుమారు రూ. 1.46 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు, వెండిని సీజ్ చేశారు. ఆరు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు, ఇతర పత్రాలను గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Army Soldier Death | ఆర్మీ జవాన్ అనుమానాస్పద మృతి