అక్షరటుడే, వెబ్‌డెస్క్: Army Soldier Death | జమ్మూ (Jammu)లోని ప్రధాన బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం ఓ ఆర్మీ జవాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీసీ రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని రాంబన్ జిల్లా చందర్‌కోట్ ప్రాంతానికి చెందిన సంజీత్ సింగ్ (31)గా గుర్తించారు.
సంజీత్ సింగ్ సెలవుపై వెళ్లారు. సెలవులు ముగియడంతో తిరిగి విధులలో చేరేందుకు వెళ్తుండగా.. అతడుబస్టాండ్ సమీపంలో చనిపోయి కనిపించాడు. విధులు నిర్వహిస్తున్న గురుదాస్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 5.40 గంటల సమయంలో జమ్మూ బస్ స్టాండ్ సమీపంలోని బీసీ రోడ్డు పక్కన సింగ్ మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.
Army Soldier Death | కేసు నమోదు
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. సింగ్‌కు భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. కాగా ఇటీవల ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్మీ జవాన్ మృతి వెనుక ఉగ్రకోణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Arunachal Pradesh Security | భద్రతాపరంగా అరుణాచల్ ప్రదేశ్ కీలకం : అమిత్ షా