అక్షరటుడే, వెబ్డెస్క్: Airtel Market Capitalization | భారత స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూనే మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో విలువైన కంపెనీగా రికార్డు సృష్టించిన జియో ప్లాట్ఫామ్స్.. ఈ క్రమంలో ఎయిర్టెల్ ను వెనక్కి నెట్టింది.
జియో షేర్లు అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్ (Stock market)లో లిస్టయిన విషయం తెలిసిందే. లిస్టింగ్ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.50 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత కూడా స్టాక్ ప్రైస్ పెరగడంతో మార్కెట్ విలువ పెరుగుతూ వచ్చింది.
Airtel Market Capitalization | మళ్లీ నంబర్ టూ రేసులోకి..
జియో రాకకుముందు దేశీయ స్టాక్ మార్కెట్లో రెండో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా భారతీ ఎయిర్టెల్ ఉండేది. జియో ప్లాట్ఫామ్స్ జోరుతో 3వ స్థానానికి పడిపోయింది. అయితే ఇటీవల జియోలో ప్రాఫిట్ బుకింగ్తో దాని విలువ తగ్గగా.. ఇదే సమయంలో కొనుగోళ్ల మద్దతుతో ఎయిర్టెల్ విలువ పెరిగింది. ఈ క్రమంలో జియోను దాటేస్తూ ఎయిర్టెల్ తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ విలువ శుక్రవారం(నవంబర్ 20) ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 13.49 ýక్షల కోట్లుగా ఉంది.
Airtel Market Capitalization | నాలుగో స్థానానికి జియో..
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ సమయంలో అదరగొట్టిన జియో ప్లాట్ఫామ్స్.. ఇటీవల ప్రాఫిట్ బుకింగ్తో మార్కెట్ విలువను కోల్పోయింది. శుక్రవారం(నవంబర్ 20) ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ రూ. 12.77 లక్షల కోట్లుగా ఉంది. దీంతో Âదేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో రెండో స్థానాన్ని కోల్పోవడమే కాకుండా నాలుగో స్థానానికి పడిపోయింది.
Airtel Market Capitalization | అగ్రస్థానంలో రిలయన్స్..
దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతోంది. ఆ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 18.64 లక్షల కోట్లుగా ఉంది. రూ.13.05 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3వ స్థానంలో, రూ. 11.78 లక్షల కోట్లతో ఐసీఐసీఐ బ్యాంక్ ఐదో స్థానంలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: NSE Market Capitalization | ఎన్ఎస్ఈ దూకుడు.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీ గా గుర్తింపు