Arunachal Pradesh Security | భద్రతాపరంగా అరుణాచల్​ ప్రదేశ్​ కీలకం : అమిత్​ షా

అరుణాచల్ ప్రదేశ్ భద్రతాపరంగా అత్యంత కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్​షా అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Arunachal Pradesh Security | సుదీర్ఘమైన అంతర్జాతీయ సరిహద్దు ఉన్నందున అరుణాచల్ ప్రదేశ్ భద్రతాపరంగా అత్యంత కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Amit Shah) అన్నారు. ‘ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అరుణాచల్ ప్రదేశ్​కు 1,863 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉందన్నారు. చైనాతో 1,126 కిలోమీటర్లు, మయన్మార్‌తో 520 కిలోమీటర్లు భూటాన్‌తో 217 కిలోమీటర్ల సరిహద్దులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం ‘డెత్ ట్రయాంగిల్’ అని పిలవబడే ప్రాంతానికి సమీపంలో ఉందన్నారు. అక్కడి నుంచి మాదకద్రవ్యాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతుంటాయని చెప్పారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో అరుణాచల్ ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

Arunachal Pradesh Security | ఉగ్రవాదులను అంతం చేశాం

కాశ్మీర్‌లోని పుల్వామాలో, లష్కర్‌తో సంబంధం ఉన్న చివరి స్థానిక ఉగ్రవాదిని కాశ్మీర్ పోలీసులు ఒక ఎన్‌కౌంటర్‌లో అంతం చేశారని అమిత్​ షా తెలిపారు. కాశ్మీర్ లోయలో ఇప్పుడు ఒక్క స్థానిక ఉగ్రవాది కూడా లేడని ఆయన చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఉన్నవారంతా విదేశీ ఉగ్రవాదులే అన్నారు. 1990లలో కాశ్మీర్​లో పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో భద్రతా దళాల పరాక్రమమే కాశ్మీర్‌ను దేశంతో కలిపి ఉంచిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ యువతలో ఉన్న వేర్పాటువాద భావనకు ముగింపు పలికిందన్నారు.

ఇది కూడా చదవండి..: Viksit Bharat Mission | 20 ఏళ్లలో వికసిత్ భారత్​ నిర్మిస్తాం : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *