Illegal Constructions | నందిపేట్​లో అక్రమ కట్టడాల కూల్చివేత..

నందిపేట మండలంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్: Illegal Constructions | నందిపేట (Nandipet) మండలంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. స్థానిక పడిగల చెరువు కట్ట బఫర్ జోన్​లో అక్రమ నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు.

Illegal Constructions | పోలీసు బందోబస్తు మధ్య..

ట్రైయినీ కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సురేష్ పామూరి ఆధ్వర్యంలో అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో బఫర్​ జోన్​లో ఉన్న అక్రమ కట్టడాల వద్దకు ఉదయం చేరుకున్నారు. ఆ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్లను, భవంతుల నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బఫర్ జోన్​లో నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను ఎట్టిపరిస్థితుల్లో కూల్చివేస్తామని హెచ్చరించారు కూల్చివేత కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bank Account Freeze | మహిళా రైతుపై బ్యాంక్​ జులుం.. సేవింగ్స్​ ఖాతా ఫ్రీజ్​..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *