అక్షరటుడే, వెబ్డెస్క్ : HYDRAA | రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్ మండలం తొండిపల్లి గ్రామంలోని సందపల్లి చెరువులో కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం జేసీబీలతో కూల్చివేతలు చేపట్టి 4 ఎకరాల భూమిని కాపాడింది.
చెరువులోకి జరిగి పలువురు నిర్మాణాలు చేపట్టారు. 4 ఎకరాల వరకూ జరిగి ప్రహరీ నిర్మించి ఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టింది. మొత్తం చెరువు విస్తీర్ణం 76 ఎకరాలు కాగా.. ఈ మేరకు చెరువు లోపల వైపు కబ్జాలకు ఆస్కారం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఎఫ్టీఎల్ పరిధిలోనే 100 గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటిని, ఆ పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డును కూడా నేలమట్టం చేసింది.
HYDRAA | కఠిన చర్యలు
చెరువు లోపల భాగం నుంచి కబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న హైడ్రా క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించింది. చెరువు ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు నిర్ధారించుకుని చర్యలు చేపట్టింది. స్థానిక ఇరిగేషన్ అధికారుల సమక్షంలో హైడ్రా అధికారులు 1600 మీటర్ల మేర ఫెన్సింగ్ వేశారు. చెరువుకు చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. చెరువును ఆక్రమించి, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు చేపడుతామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : TGSPDCL ACB Trap | రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిన సబ్ ఇంజినీర్