Choutpalli PHC Inspection | పీహెచ్‌సీలో వైద్యుల్లేకపోవడంపై కలెక్టర్​ ఆగ్రహం.. డిప్యుటేషన్ల రద్దు చేయాలని ఆదేశం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందేనని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ/ భీమ్‌గల్: Choutpalli PHC Inspection | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందేనని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. కమ్మర్‌పల్లి(Kammarpally) మండలం చౌట్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Choutpalli PHC Inspection | డిప్యుటేషన్లపై ఆగ్రహం

ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సు, స్వీపర్‌ మినహా మిగతా వైద్యులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు మరికొందరు సిబ్బంది డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు తెలుసుకుని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజశ్రీకి ఫోన్‌ చేసి, డిప్యుటేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు.

Choutpalli PHC Inspection | రికార్డుల తనిఖీ

ఆస్పత్రిలోని రిసెప్షన్‌, ఇన్‌పేషెంట్‌, జనరల్‌ వార్డులు, ఫార్మసీ, ల్యాబ్‌, వ్యాక్సినేషన్‌ గదులను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. మందుల నిల్వ గది అస్తవ్యస్తంగా ఉండటంపై స్టాఫ్‌నర్సును మందలించారు. మధుమేహం, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నిర్ధారణ, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. గడువు ముగియనున్న ఔషధాల వివరాలను పరిశీలించి, ముందస్తుగా ఇండెంట్‌ పంపి అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచాలని సూచించారు. శీతలీకరణలో భద్రపరచాల్సిన మందులను ఫ్రిజ్‌లలోనే ఉంచాలని ఆదేశించారు.

గర్భిణులకు క్రమం తప్పకుండా ఏఎన్‌సీ పరీక్షలు నిర్వహించాలని, హైరిస్క్‌ కేసులను ఏరియా ఆసుపత్రికి పంపించాలని సూచించారు. ఈడీడీ క్యాలెండర్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మరోసారి ఆకస్మిక తనిఖీ చేస్తానని, అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ..10km కి చుక్కలు తప్పవు.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *