Electric Scooter Fire | ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

మాచారెడ్డి మండలంలో ఎలక్ట్రిక్ స్కూటీ కాలి బూడిదైంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Electric Scooter Fire | ఎలక్ట్రిక్ స్కూటీ కాలి బూడిదైంది. ఈ ఘటన మాచారెడ్డి(machareddy) మండలంలో శనివారం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Electric Scooter Fire | తప్పిన పెను ప్రమాదం

వివరాల్లోకి వెళ్తే.. మాచారెడ్డి మండలంలోని కాకుల గుట్ట తండాకు చెందిన భూక్య గణేష్ తన తల్లితో కలిసి ప్రతిరోజూ మాదిరిగానే కూరగాయలు విక్రయించేందుకు ఎలక్ట్రిక్ స్కూటీపై మాచారెడ్డి వైపు బయలుదేరాడు. తండా దాటి కొంత దూరం వెళ్లిన తర్వాత స్కూటీలోని బ్యాటరీ భాగం నుంచి పొగ రావడం గమనించాడు. మొదట ఏదో చిన్న సమస్య అనుకున్న గణేష్, క్షణాల్లోనే మంటలు పెరగడంతో వెంటనే స్కూటీని రోడ్డు పక్కన నిలిపివేసి, తల్లిని పక్కకు తీసుకుని దూరంగా పరుగెత్తాడు. అతడు దిగిన కొద్ది సెకన్లలోనే మంటలు మొత్తం స్కూటీని చుట్టుముట్టాయి. చుట్టుపక్కల ఉన్నవారు నీళ్లు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కళ్ల ముందే స్కూటీ పూర్తిగా కాలిపోయింది.

Electric Scooter Fire | కొద్దిపాటి ఆలస్యం జరిగిఉంటే..

గణేష్ గనుక కొన్ని సెకన్లు ఆలస్యం చేసి ఉంటే తల్లీకొడుకులిద్దరూ మంటల్లో చిక్కుకునేవారని స్థానికులు పేర్కొన్నారు. వారిద్దరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మాచారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు పెరుగుతుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన బ్యాటరీలు, చార్జర్లు మాత్రమే వాడాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : పూరీలో ఏకాదశి మహాదీపం..కనువిందు చేసిన దివ్య దృశ్యం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *