Navipet Railway Gate | నవీపేట్​ రైల్వేగేట్​ మూసివేత.. ఎన్ని రోజులో తెలుసా..?

నవీపేట్​ మండల కేంద్రంలో ఉన్న రైల్వేగేట్​ను మూసివేయనున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Navipet Railway Gate | నవీపేట్ (Navipet)​ మండల కేంద్రంలో ఉన్న రైల్వేగేట్​ను మూసివేయనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Navipet Railway Gate | ఈనెల 22వ తేదీ నుంచి 26 వరకు..

నవీపేట్​ మండల కేంద్రంలో బాసరకు వెళ్లే రహదారిపై ఉన్న రైల్వేగేట్​ వద్ద మరమ్మతులు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 22వ తేదీ నుంచి 26వరకు ఐదు రోజుల పాటు గేట్​ను మూసివేయనున్నట్లు ఉమ్రి సెక్షన్​ ఇన్​ఛార్జి దుర్గాప్రసాద్​ వెల్లడించారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైల్వేకు సహకరించాలని ఆయన కోరారు.

ఇది కూడా చదవండి: పిల్లల్లో స్క్రీన్ టైమ్ పెరిగితే ఏమవుతుంది? పేరెంట్స్ తప్పక చూడాల్సిన వీడియో!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *