Iran US Fighter Jet | అమెరికా యుద్ధ విమానాన్ని దెబ్బతీశాం : ఇరాన్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran US Fighter Jet | పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తమ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని దెబ్బతీశామని, దీంతో ఆ విమాన పైలట్ సమీపంలోని ఒక ఎయిర్‌బేస్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను అమెరికా ఖండించింది.

హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇరాన్ సైన్యానికి చెందిన ప్రజా సంబంధాల విభాగం మాట్లాడుతూ.. పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్న అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తమ దేశీయ వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించాయని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళం ఆ విమానాన్ని ట్రాక్ చేసి, దానిపైకి ఒక క్షిపణిని ప్రయోగించిందని తెలిపింది.

Iran US Fighter Jet | ఎమర్జెన్సీ ల్యాండింగ్​

ఈ క్షిపణి యుద్ధ విమానానికి సమీపంలో పేలడంతో విమానం దెబ్బతిన్నదని, పైలట్ తన మిషన్‌ను మధ్యలోనే నిలిపివేసి, సమీపంలోని ఒక ఎయిర్‌బేస్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారని ఇరాన్​ పేర్కొంది. ఆ విమానం ఎక్కడ ల్యాండ్ అయిందనే వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ చేసిన ఈ వాదనను అమెరికా పూర్తిగా ఖండించింది. ఇరాన్ ఎటువంటి అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానంపై దాడి చేయలేదని తెలిపింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక యుద్ధ విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

దీనిని కూడా చదవండి : Rajasthan Accident | రాజస్థాన్​లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *