అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Afghanistan Airstrikes | పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇటీవల అఫ్గాన్‌పై పాక్ దాడి చేయగా.. తాజాగా ఆ దేశం ఎదురుదాడులకు దిగింది.
ఆఫ్గనిస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం, పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారీ వైమానిక, డ్రోన్ దాడులు నిర్వహించింది. పాక్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులలో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (ISIS-K)కు చెందిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఇస్లామిక్ ఎమిరేట్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వైమానిక దాడులను అధికారికంగా ధ్రువీకరించింది.
Afghanistan Airstrikes | ఉగ్రస్థావరాలపై..
వైమానిక దాడులు అత్యంత కచ్చితత్వంతో జరిగాయని, ఐసిస్-కె ఉగ్రవాదులకు భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించాయని అఫ్గానిస్థాన్ తెలిపింది. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని తాలిబన్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్ భద్రతకు ముప్పు కలిగించే ఏ ఉగ్రవాదిని, వారి స్థావరాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాగా ఇటీవల పాక్ వైమానిక దాడుల్లో 28 మంది అఫ్గన్ పౌరులు మరణించగా, 49 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Afghanistan Airstrikes | డ్రోన్లలను కూల్చాం

నాలుగు డ్రోన్‌లను కూల్చివేసినట్లు పాక్ సైన్యం తెలిపింది. ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా “తగిన ప్రతిస్పందన ఉంటుందని” హెచ్చరించింది. తమ భూభాగంలో దాడులు చేసే ఉగ్రవాదులకు అఫ్గనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని కరాచీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణను తాలిబన్ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. తాజా దాడులతో ఇరు దేశాల ప్రజల్లో మరోసారి ఆందోళన నెలకొంది.
దీనిని కూడా చదవండి : Government Employees Degree | ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా రెగ్యులర్ డిగ్రీలు పూర్తి చేస్తే అవి చెల్లవు