France Music Festival Violence | మ్యూజిక్ ఫెస్టివల్‌లో దారుణం.. సిరంజీలతో గుచ్చి యువతులపై దాడులు

ఫ్రాన్స్‌లో ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరిగే ‘ఫేట్ డి లా ముసిక్’ (Fete de la Musique) సంగీతోత్సవాలు ఈసారి తీవ్ర విషాదానికి దారితీశాయి

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: France Music Festival Violence | ఫ్రాన్స్‌లో ( France ) ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరిగే ‘ఫేట్ డి లా ముసిక్’ (Fete de la Musique) సంగీతోత్సవాలు ఈసారి తీవ్ర విషాదానికి దారితీశాయి. లక్షలాది మందితో సందడిగా సాగాల్సిన ఈ వేడుకలు, రాత్రికి రాత్రే హింస, లైంగిక దాడులతో అల్లకల్లోలంగా మారాయి. ముఖ్యంగా రాజధాని పారిస్ నగర వీధులు రణరంగాన్ని తలపించాయి.

France Music Festival Violence | ‘నీడిల్ స్పైకింగ్’ దాడులు..

ఈ ఉత్సవాల్లో అత్యంత దారుణమైన ఘటనలు వెలుగుచూశాయి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కొందరు దుండగులు మహిళలను లక్ష్యంగా చేసుకుని సిరంజీలతో సూదులు గుచ్చినట్లు (Needle Spiking) తేలింది. పారిస్‌లోని బౌలేవార్డ్ డి లా మాడలీన్ వద్ద ఇలాంటి దాడికి గురైన ఒక మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంలోకి ఏదైనా మత్తు పదార్థం ఎక్కించారా అనే కోణంలో అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఇద్దరు మహిళలపై అత్యాచారం జరగడం, మరికొందరు యువతులపై లైంగిక దాడులు జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితుల్లో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

France Music Festival Violence | వీధి గొడవలు, కత్తిపోట్లు..

పారిస్ నగరంలోని ‘ఛాటెలెట్’ వంటి రద్దీ ప్రాంతాల్లో గ్యాంగ్ వార్స్, కత్తిపోట్లు జరిగాయి. జనం ఒక్కసారిగా పరుగులు తీయడంతో తోక్కిసలాట వంటి పరిస్థితులు తలెత్తాయి. భయాందోళనల నడుమ పండుగను ఆస్వాదించడానికి వచ్చిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

France Music Festival Violence | పోలీసుల చర్యలు ..

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టి దేశవ్యాప్తంగా దాదాపు 243 మందిని అరెస్ట్ చేశారు. ఇంత భారీ స్థాయిలో జనం వస్తారని తెలిసినా, ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఫ్రాన్స్‌లోని అధికార యంత్రాంగంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Urea Protest | యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జాతీయ రహదారిపై రాస్తారోకో

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *