Fire Accident | ప్యాకింగ్​ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాబాద్​ మండలం హైతాబాద్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fire Accident | రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాబాద్​ మండలం హైతాబాద్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చందనవెల్లిలోని ట్రీ ఫాయిల్‌ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది.

అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తలరించారు. ఆస్తి నష్టం, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Dowry Car Dispute | కారు కోసం పెళ్లి రద్దు చేసుకున్న పోలీస్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *