Pulse Polio | అందోల్–జోగిపేటలో పల్స్​ పోలియో

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pulse Polio | సంగారెడ్డి (Sangareddy) జిల్లా అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 17వ వార్డులలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో వ్యాధి నుండి రక్షణ కల్పించేందుకు రెండు చుక్కల పోలియో మందులను పంపిణీ చేశారు.

Pulse Polio | పోలియో చుక్కలు వేయించాలి

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) పాల్గొని మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో మందులు వేయించాలని కోరారు. రెండు చుక్కలే చిన్నారులకు రక్షణ కవచమని పేర్కొంటూ, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శంకర్, హెడ్ నర్స్ సుజాత, శాంతా సిస్టర్, నాయకులు వీరేశం, అశోక్, చెన్నయ్య, విజయ్, భరత్, వినయ్, చంటి, గోపాల్ పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Drought Relief | కరువు నివారణకు సాయం చేయలి.. పీఏసీ కీలక తీర్మానాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *